Sunday, January 19, 2025

కొల్హాపూర్ అమ్మవారి సేవలో కెసిఆర్ దంపతులు

- Advertisement -
- Advertisement -

గురువారం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహారాష్ట్ర కొల్హాపూర్ శ్రీ అంబాబాయి మహాలక్ష్మిఅమ్మవారిని ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా సందర్శించుకొని దేవి అలంకార పూజలో పాల్గొన్నప్పటి దృశ్యం. ముఖ్యమంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్ రావు, రావుల శ్రవణ్‌కుమార్ తదితరులున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : అష్టాదశ శక్తి పీ ఠాలలో ఒకటైన మహరాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీఅమ్మవారిని సిఎం కెసిఆర్ గురువారం నాడు దర్శించుకున్నారు. దర్శించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్ కుటుంబ సమేతంగా కొల్హాపూర్‌కు వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో అధికారులు సిఎం కెసిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఆలయానికి చేరుకోగా, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. మహాలక్ష్మిఅలంకార పూజలో సిఎం కెసిఆర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర ్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అక్కడ మీడియాతో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ‘చాలా రోజుల నుంచి తాను ఈ దేవాలయానికి వద్దామని.. అమ్మ ఆశీస్సులు తీసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. దేశం అభివృద్ధి పథంలో సాగాలని.. రైతులు ఆనందంగా ఉండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మను కోరుకున్నా’ అని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ దంపతులతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, రావుల శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సిఎం కెసిఆర్ తిరిగి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News