Thursday, January 23, 2025

వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ నవగ్రహ యాగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మర్కుక్: సిద్దిపే ట జిల్లా, మర్కుక్ మండలం, ఎర్రవల్లి గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ సిఎం కెసిఆర్ దంపతులు శుక్రవారం మహా నవగ్రహయాగం నిర్వహించారు. యాగశాలలో వేద పండితు ల మంత్రోచ్ఛారణల మధ్య నవగ్రహ యాగం ఎదుట జ్యోతి ప్రజ్వలన చేసి యాగం ప్రారంభించారు. యాగం కొనసాగేందుకు వీలుగా ముందుగా మ హాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం నవగ్రహ యాగంలో మహా మంగళ హారతి, పుష్పాభిషేకం, అష్టావధాన సేవ తదితర కార్యక్రమాలు వేద పండితులు నిర్వహింపజేశారు. అనంతరం కెసిఆర్ దంపతులు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, మా జీ ఎంఎల్‌ఎలు, జెడ్‌పిటిసిలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News