Monday, January 20, 2025

ఫామ్ హౌస్లో కెసిఆర్ దంపతుల రాజశ్యామల యాగం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం ప్రారంభమైంది. ఈ యాగంలో కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు. పలువురు పీఠాధిపతులతోపాటు దాదాపు 200 మంది పురోహితులతో ఈ రాజశ్యామల యాగం కొనసాగుతుంది. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు ఈ యాగం జరగనుంది. మరోవైపు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు(బుధవారం) సత్తుపల్లి, ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభల్లో కెసిఆర్ పాల్గొనాల్సి ఉంది.

కాగా, మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కెసిఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. 2018 ఎన్నికలకు ముందు కూడా కెసిఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News