Monday, December 23, 2024

ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైన కెసిఆర్ కప్ టోర్నమెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో మెల్బోర్న్ లో జరుగుతున్న కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ను బుధవారం మెల్బోర్న్ లోని పవిలియన్ లో అట్టహాసంగా ప్రారంభించారు. భారత దేశానికి చెందిన ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలతో 3 వారాల పాటు ఈ టోర్నమెంట్ జరగబోతుందని బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . సెప్టెంబర్ 16, 17 న గ్రాండ్ ఫైనల్స్‌ను అంగరంగ వైభవంగా జరపబోతున్నామని, భారత దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలు , వివిధ సంఘాల నాయకులు , ప్రజలు ఇందులో పాల్గొన బోతున్నరని నాగేందర్ రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్ నుండి బిఆర్‌ఎస్‌కు మార్పు గల ముఖ్య ఉద్దేశాన్ని

అందరికీ తెలిచేయాలని అందుకే క్రికెట్ సరైన వేదిక అని ఈ టోర్నమెంట్ నిర్వహించామని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమంపై విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ ప్రెజెంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సాయిరామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రి ప్రగడ, వినయ్ సన్నీ గౌడ్, బాలరాజు కుమ్మరి, వంగపల్లి సురేందర్ రెడ్డి, హర్షరెడ్డి , గండ్ర ప్రశాంత్‌రావు , విజయ్ నడదూర్ , శివ హైదరాబాద్ , హరి పల్ల , కరుణాకర్ నందవరం, వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News