Sunday, December 22, 2024

‘పాలమూరు’కు కెసిఆర్ దగా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దోచుకుందని సిడబ్లుసి సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డ్డి, ఎంఎల్‌ఎలు వై శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. శనివారం చలో పాలమూరు రిజర్వాయర్లు పేరుతో కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బిఆర్‌ఎస్ సర్కార్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుందని దుయ్యబట్టారు. పాలమూరు జిల్లాలో గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన భీమా నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల ప్రాజెక్టు తప్ప కొత్తగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో ఏ ప్రాజెక్టు నిర్మించలేదని అన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో రైతులను, ప్రజలను మభ్యపెట్టి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. కనీసం 30% కూడా రిజర్వాయర్లు పూర్తి కాలేదన్నారు. ఎన్నికల ముందు 80% ప్రాజెక్టులు పూర్తయ్యాయని, గత ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను మోసం చేశారన్నారు. మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ 8 సంవత్సరాలైనా పూర్తి చేయలేదని ఆరోపించారు. కెసిఆర్ ఒక దగాకోరైతే. మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడి చెంచాలుగా పనిచేశారని ఆరోపించారు. గతంలో బిఆర్‌ఎస్ మంత్రులు, ఎంఎల్‌ఎలు గజదొంగలుగా మారి ప్రాజెక్టుల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నారని తీవ్రంగా విమర్శించారు. 11 టిఎంసిల నీటిని కృష్ణా బేసిన్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా నదికి తీసుకెళ్తుంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చుస్తూ ఊరుకుందని విమర్శించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్, కోసిగి ప్రాంతాలకు ఒక్క టిఎంసిల నీరైనా ఇచ్చారా అని నిలదీశారు. ఎన్నికల సమయంలతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు కేవలం ఒక మోటార్‌ను మాత్రమే ప్రారంభించారని ఆపేక్షించారు. దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిలో 68.5% క్యాష్‌మెంట్ వాటా ఉండగా, అసమర్థ ముఖ్యమంత్రి కెసిఆర్ వల్ల తెలంగాణ తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానదిపై 875 టిఎంసిల వాటా ఉండగా గత సర్కార్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కృష్ణానదిపై మనకు రావాల్సిన 575 టిఎంసిలలో కేవలం 200 టిఎంసిలకు కెసిఆర్ ఒప్పుకుని తెలంగాణకు.. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం, మేడిగడ్డ రిజర్వాయర్‌తో పాటు రాష్ట్రంలోనే ప్రాజెక్టులతో రాష్ట్ర ఖజానాను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం, మేడిగడ్డ రిజర్వాయర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులతో రాష్ట్ర ఖజానాను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయని వారు ఘాటుగా విమర్శించారు. గత కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలమూరు జిల్లాలో అనేక ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. ఇప్పటికీ ఆ నీళ్లే రైతులకు సాగునీరుగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే అవకాశం ఉన్నా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. 32 వేల కోట్ల కాంట్రాక్ట్ పనులను జడ్చర్ల మాజీ ఎంఎల్‌ఎ లకా్ష్మరెడ్డి ఆంధ్ర వాళ్లకు కట్టబెట్టి పాలమూరు అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు వాకిటి శ్రీహరి, ఫర్ణిక రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News