- Advertisement -
మహేష్ బిగాల టిఆర్‌ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని టిఆర్‌ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం ద్వారా పేదలకు, సామాన్యులకు విద్య మరింత చేరువ అవుతుందన్నారు. ‘మన ఊరు-మన బడి’ అనేది కెసిఆర్ ఆలోచనలకు తార్కాణంగా నిలుస్తుందన్నారు. చిన్నప్పటి నుంచే ఆంగ్ల భాషలో చదవడం వల్ల సామాన్యులు పైచదువులకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సిఎం కెసిఆర్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలిపారు.
- Advertisement -