- Advertisement -
హైదరాబాద్: అవినీతి కారణంగానే కెసిఆర్ ఓటమి పాలయ్యారని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. నారాయణ మీడియాతో మాట్లాడుతూ… మేడిగడ్డ కుంగుబాటు బిఆర్‌ఎస్ పతనానికి పరాకాష్ఠకు చేరిందని, పిల్లర్లు కుంగిపోతే రాద్దాంతం చేస్తున్నారని కెసిఆర్ అనడం అవివేకమని చురకలంటించారు. కెసిఆర్ సిఎం చేశారా? లేక నౌకరీ చేశారా? అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ నుంచి ఎంఎల్‌ఎగా గెలిచి అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని నారాయణ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో కెసిఆర్‌ను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేశారు.
- Advertisement -