Tuesday, January 21, 2025

గిరిజన సంక్షేమ శాఖకు పెద్దపీట వేశాం: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

KCR developed Govt Hospitals

జయశంకర్ భూపాలపల్లి: సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం చేశామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రిని మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు  ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యవతి మీడియాతో మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు బడ్జెట్ లో పెద్దపీట వేశామని, కెసిఆర్ కిట్ తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణ లక్ష్మి ద్వారా రూ. లక్షా 116 ఆర్థిక సాయం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి దయాకర్, సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News