Thursday, January 23, 2025

మహిళల సంక్షేమం కోసం కెసిఆర్ ఎంతో కృషి : గాంధీ

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: మహిళ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో 17,50,000/రూపాయల ఎమ్మేల్యే నిధులతో నూతనంగా నిర్మించిన మహిళ భవనంను కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే గాంధీ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ సంతులిత సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, దానిలో భాగంగానే మహిళ భవనంను నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పధ్యతరగతి, ప్రజలు నివసిస్థున్న ఈ ప్రాంతంలో మహిళ భవనం ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడి మహిళలకు సమావేశాలు, సభలు, చిన్నచిన్న ఫంక్షన్ లు జన్మదిన వేడుకలు, వివాహలు నిర్వహించకునేందుకు వీలుగా మహిళ భవనం అన్ని హంగులతో సకల సౌకర్యాలతో నిర్మించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కోన్నారు.

అనంతరం వేముకుంట కాలనీ మహిళలు మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే మహిళ భవనం నిర్మాణం కొరకు సహకరించిన ప్రభుత్వ విప్ ఎమ్మేల్యే గాంధీ కి కాలనీ వాసుల తరపున ప్రత్యేక కృతజ్ఙాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పోరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు జనార్ధన్ రెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, అక్బర్ ఖాన్, రాంచందర్, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ బల్లా, అంద్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, మరియు నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News