Monday, December 23, 2024

మహిళా సంక్షేమానికి కేసీఆర్ ఎంతో కృషి : అరికెపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: మహిళా సంక్షేమానికి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బిఆర్ ఆంబేద్కర్ కళ్యాణమండపంలో మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ వెంకన్న, సుధాంష్, సీడిపిఓ లక్ష్మీబాయి, డీఆర్‌డిఏ ఏపిఓ శ్యేతా, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉషారాణి, ఇంద్రసేనలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, షీటీమ్స్, భరోసా, సఖి కేంద్రాలు, పారిశ్రామికులుగా ఎదగడానికి వీ హబ్ తదితర కార్యక్రమాలతో మహిళలను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కార్పోరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అంగన్ వాడి సూపర్‌వైజర్లు, అంగన్ వాటి టీచర్లు, తదితర మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News