Sunday, December 22, 2024

కవిత అరెస్టును కెసిఆర్ ఖండించలేదు.. మౌనాన్ని ఏమని అర్థం చేసుకోవాలి: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఖండించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేవారు.. కానీ నిన్న మాత్రం మోడీ, ఈడీ కలిసే వచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ కుటుంబం, బిజెపి నిరంతర ధారావాహిక సీరియల్ లాగా మద్యం కంభకోణాన్ని నడిపించారని ఆయన తెలిపారు. కవిత అరెస్టు విషయంలో కెసిఆర్ మౌనం ఏ విధంగా అర్ధం చేసుకోవాలన్నారు. కవిత అరెస్టు బిజెపి, బిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని సిఎం వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ కు ఒక రోజు ముందు అరెస్టును ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

అవినీతిపరులపై చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్ షిప్ లో మోడీకి ఓట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లను అరెస్ట్ చేశారనే సానుభూతితో బిఆర్ఎస్ కు ఓట్లు వేయాలి. కానీ 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని సర్వేలన్నీ చెబతున్నాయి. కాంగ్రెస్ దెబ్బతీసేందుకు బిజెపి, బిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బిఆర్ఎస్- బిజెపి అరెస్టు నాటాకాలను ప్రజలు గమనించాలని సిఎం ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News