Sunday, January 19, 2025

లండన్‌లో ఘ‌నంగా కెసిఆర్-దీక్షా దివస్

- Advertisement -
- Advertisement -

లండన్‌లో కెసిఆర్ – దీక్షా దివస్ ని ఎన్నారై బి.ఆర్.యస్ యునైటెడ్ కింగ్ డమ్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
కెసిఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. నవంబర్ 29, 2009 నాడు కెసిఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా భావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామన్నారు.

‘తెలంగాణ వచ్చుడో -కెసిఆర్ సచ్చుడో’ అనే నినాదంతో తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతి యుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కెసిఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు

నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీజీ – కెసిఆర్ పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంథాతో ఏదైన సాధించవచ్చు అనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్నీ, మార్గాన్ని చూపిన గొప్ప స్ఫూర్తి దాత నాయకుడు మన కెసిఆర్ అని ప్రశంసించారు.ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టమని, బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బి.ఆర్.యస్ సెల్ సభ్యులు రవి ప్రదీప్ పులుసు, రవి రేటినేని, సురేష్ గోపతి, హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి బండ, మల్లారెడ్డి బీరం, వెంకట్ రెడ్డి దొంతుల, ప్రశాంత్ కటికనేని, శ్రీకాంత్ జెల్లా, నవీన్ భువనగిరి, అబ్దుల్ జాఫర్, గణేష్ కుప్పల,ప్రశాంత్ మామిడాల, రామకృష్ణ, ముఖ్య సభ్యులు శుషుమ్న రెడ్డి, క్రాంతి రేటినేని,
సుప్రజ పులుసు, స్నేహ నవాబుపేట్, మట్టా రెడ్డి, నవీన్, అంజన్ రావు, శశి, నరేష్ జక్కుల హాజరైన వారిలో వున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News