Sunday, December 22, 2024

రేపు కెసిఆర్ డిశ్చార్జ్… నేరుగా అక్కడికే వెళ్లనున్నారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్  నందినగర్ లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడడంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కెసిఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News