Thursday, January 23, 2025

కారు నేషనల్ గేరు

- Advertisement -
- Advertisement -

ప్రాంతీయం నుంచి జాతీయానికి సారు

ఢిల్లీ లక్షంగా నేడు జాతీయ పార్టీ పేరు ప్రకటన

ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ
విస్తృతస్థాయి సమావేశం టిఆర్‌ఎస్ పేరు బిఆర్‌ఎస్‌గా
మార్చుతూ తీర్మానం విధివిధానాలపై స్పష్టం
చేయనున్న టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్
సమావేశానికి హాజరుకానున్న పలువురు జాతీయస్థాయి నాయకులు
హైదరాబాద్ చేరుకున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి
రేపు ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు నేషనల్ టీంలో పలువురు
సీనియర్లకు చోటు మునుగోడుతోనే తొలి విజయం దక్కేలా వ్యూహాలు
నేడు మునుగోడు అభ్యర్థి ప్రకటన కర్నాటక, గుజరాత్ ఎన్నికలపై నజర్

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీకి కౌం ట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది. ఢిల్లీ పీఠమే లక్షంగా కెసిఆర్ బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 1.19గంటలకు జా తీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. దీని కోసం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చే శారు. ఈ సమావేశానికి 283 మంది సభ్యులను ఆహ్వానించారు. వారి ఏకగ్రీవ ఆమోదంతో టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చుతూ సమావేశంలో తీర్మానం చేస్తా రు. ఈ కొత్త పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా… దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ చేతులమీదుగా పురుడుపోసుకుంటున్న కొత్త జాతీయ పార్టీ ఎలా ఉండబోతుం ది? దాని విధి విధానాలు ఏమిటీ? అన్న అంశాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఈ సందేహలన్నింటికి నేడు కెసిఆర్ తెరదించనున్నారు.

ఏ పరిస్థితుల్లో తాను జాతీయ పా ర్టీ ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశంపై మరోసారి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కెసిఆర్ స్ప ష్టత ఇవ్వనున్నారు. ప్రస్తుతం దేశంలో జాతీ య పా ర్టీలుగా కొనసాగుతున్న బిజెపి, కాం గ్రెస్‌లకు మన పార్టీ ఎందుకు భిన్నంగా ఉం టుందన్న విషయాన్ని పార్టీ నేతలకు కెసిఆర్ వివరించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు కెసిఆర్  ఉదయం 11.30 గంటలకల్లా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. మొదటగా కొత్త పార్టీ ప్రతిపాదన చేసి మాట్లాడతారు. అనంతరం కెసిఆర నిర్ణయాన్ని ఆమోదిస్తూ శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు, ఎంపీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు సంతకాలు చేస్తారు. ఈ ప్రక్రియ ముగియగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటారు. కెసిఆర్ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వాప్తంగా బాణాసంచాను పేల్చనున్నా రు. కాగా టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చే సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని వివిధ పార్టీలక నేతలను సిఎం కెసిఆర్ ఆహ్వానించారు.

కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి, గుజరాత్ మాజీ సిఎం శంకర్ సిం గ్ వాఘేలా, తమిళనాడు సిఎం స్టాలిన్, బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్‌తో పాటు రైతు సంఘాల నేత రా కేశ్ టికాయత్, సినీ నటుడు ప్రకాశ్ రాజుకు ఫోన్ చేసినట్టుగా తెలిసింది. వీరితో పాటు పలువురు రైతు సంఘా ల నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులకు కెసిఆర్ ఫోన్ చేసి పార్టీ ప్రకటనకు రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. కాగా నేటి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు టిఆర్‌ఎస్ ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, రాష్ట్ర కార్యవర్గం, జెడ్‌పి చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు మంగళవారం సాయంత్రానికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే నేతలకు సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో లంచ్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌కు చేరుకున్న కుమారస్వామి

కెసిఆర్ ఆహ్వానం మేరకు కర్నాటక మాజీ సిఎం కుమార్‌స్వామి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం కెసిఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీ కార్యక్రమంలో కుమారస్వామి పాలు పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా నగరానికి వచ్చిన ఆయనకు టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ బేగంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. కెటిఆర్ వెంట ఎంఎల్‌ఎ బాల్క సుమన్, మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. కాగా మంగళవారం అర్ధరాత్రికే చాలా మంది ఆహ్వానితులు నగరానికి చేరుకున్నారు. వారికి పలు ప్రాంతాల్లో బస సౌకర్యం కల్పించారు.

రేపు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు

టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చుతూ చేసిన తీర్మానం ప్రతులను ఢిల్లీలోని కేంద్ర ఎన్నిక సంఘానికి అందజేయనున్నారు. ఈ మేరకు తొమ్మిది సభ్యుల బృందం గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. టిఆర్‌ఎస్‌నే జాతీయ పార్టీగా మార్చుతున్న నేపథ్యంలో కారు గుర్తు, గులాబీ జెండా తమకే కేటాయించాలని కోరనున్నారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ నేతలు కోరనున్నారు. వారం రోజుల్లోగా జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తే….మునుగోడు ఎన్నికల్లో జాతీయ పార్టీ అభ్యర్ధిగానే బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది.

అప్పుడే మొదలైన స్వాగతాలు

కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సందర్భంగా అప్పుడే స్వాగతాలు మొదలయ్యాయి. ఆయనకు పలు రాష్ట్రాల్లో మద్దతు తెలుపుతున్నారు. కెసిఆర్‌కు స్వాగతం పలుకుతూ అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

పూరిలో ఒక ఆర్టిసు కెసిఆర్

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న వైనంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ …సైకత శిల్పం వేశాడు. వెల్ కమ్ టు నేషనల్ పాలిటిక్స్ అంటూ స్వాగతం పలికాడు. జై భారత్… జై కెసిఆర్…. జై బిఆర్‌ఎస్ అంటూ శిల్పంపై చెక్కిన విషయం తెలిసిందే. కాగా ఎపిలో ఇప్పటికే క్రిష్టియన్ యూత్ ఫెల్లోషిప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కెసిఆర్ మద్దతు తెలుపుతూ తీర్మానం కూడా చేసింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది సభ్యత్వం ఉండడం విశేషం.

ఢిల్లీలో తాత్కాలిక కార్యాలయం కోసం అద్దె భవనం

ప్రస్తుతం ఢిల్లీలో నిర్మిస్తున్న తెలంగాణ భవన నిర్మాణ పనులు ముగియడానికి మరికొంత కాలం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకలాపాల కోసం ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. పార్టీ విస్తరణ, ఢిల్లీ బహిరంగ సభ తదితర అంశాలపై హస్తిన పార్టీ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లనున్నారు.

రాష్టవ్యాప్తంగా సంబురాలు

కొత్త పార్టీ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తం సంబరాలు చేయడానికి సన్నద్దమయ్యా యి. తెలంగాణ భవన్ ఎదుట బాణసంచా కాల్చి ప్రకటనను స్వాగతించే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. దీని కోసం జిల్లా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపినాత్, నగర శాసనసభ్యులు రెండు రోజుల క్రితమే ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ జాతీ య పార్టీని ప్రకటించిన వెంటనే ….అందుకు మద్దతు తెలుపుతూ పెద్దఎత్తున బాణాసంచాలను కాల్చనున్నారు.

మునుగోడుతో తొలివిజయం దక్కాలి

జాతీయ పార్టీ ఏర్పాటు స్పీడ్ పెంచిన కెసిఆర్ పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు. మునుగోడులో గెలిచి జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే యోచనలో ఉన్నారు. నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందన్న విశ్వాసంతో కెసిఆర్‌ఉన్నారు. పార్టీ ముఖ్యులకు ఇదే విషయాన్ని కెసిఆర్ తెలిపినట్లు చెబుతున్నారు. కాగా కొత్త పార్టీ ప్రకటనతో ఉద్యమ పార్టీగా పుట్టిన టిఆర్‌ఎస్ ఒక చరిత్రగా మిగిలిపోనుంది.

నేడు మునుగోడు అభ్యర్ధి ప్రకటన

మునుగోడు అభ్యర్థిని కూడా నేడు కెసిఆర్ ప్రకటించనున్నారు. మునుగోడుపై ప్రగతిభవన్‌లో ఆయన మంగళవారం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్యులు, టికెట్ ఆశిస్తున్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్ధి ఎవరైనా అందరు కలిసి విజయం కోసం పనిచేయాలని సూచించారు. మునుగోడు ఉపఎన్నికను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్షంగా వ్యవహరించవద్దని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే మరోసారి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు కెసిఆర్ సూచించారు. తాను ఈ సభకు హజరుకానున్న పార్టీ నేతలకు చెప్పారు. సిపిఎం, సిపిఐ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయాలన్నారు.

నేడు జాతీయ టీమ్ ప్రకటన?

జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచిన కెసిఆర్ ఆ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో తన టీమ్‌ను ఫైనలైజ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఆ టీమ్ అంతా ఢిల్లీలోని ఆఫీసు నుంచి కార్యక్రమాలు చక్కబెట్టనున్నది. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్మాణం నుంచి మొదలుకుని…. కెసిఆర్ జాతీయ పర్యటనలు, సమావేశాలు అన్నింటినీ ఈ కోర్ టీమ్ పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మాణం పూర్తికానుందని తెలుస్తోంది.

అప్పటి నుంచి కెసిఆర్ టీమ్ పూర్తి స్థాయిలో ఢిల్లీలోనే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం మేరకు మాజీ స్పీకర్, ఎంఎల్‌సి ఎస్. మధుసూదనా చారి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర రావు ఎంఎల్‌ఎ బాల్క సుమన్, పార్టమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, డి. దామోదర్ రావు , కెఆర్ సురేశ్ రెడి,్డ లోక్‌సభ సభ్యులు నామా నాగేశ్వరరావు, కొత్తా ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు జాతీయ పార్టీ కోర్ టీమ్‌గా కెసిఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో స్వల్ప మార్పులు…చేర్పులు జరిగే అవకాశముందని కూడా సమాచారం.

కాగా తన టీమ్‌ను కూడా కెసిఆర్ అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. న్యూఢిల్లీలోని కొత్త టిఆర్‌ఎస్ ఆఫీస్ నుంచి ఈ నాయకులు ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేస్తారు. అలాగే కెసిఆర్ ఇతర ముఖ్య నాయకుల భేటీలను కూడా వీళ్లు ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీకి సంబంధించిన ప్రతి టూర్‌ను…….ఈ టీమ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది. అలాగే కేంద్ర, రాష్ట్రం నాయకత్వం మధ్య సమన్వయం ఉండేలా కూడా ఈ టీమ్ జాగ్రత్తలు తీసుకోనున్నది. జాతీయ పార్టీ ముందుగా గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేస్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నది. కెసిఆర్ ఇచ్చే సూచనల మేరకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ వ్యూహాలను ఈ టీమ్ అమలు చేయనున్నది. ప్రతి రాష్ట్రంలోని బిజెపియేతర పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ప్రధాన లక్ష్యంగా ఉండబోతున్నది.

కర్నాటక, గుజరాత్ ఎన్నికలపై నజర్

కెసిఆర్ తనకంటూ ఒక గోల్, దాన్ని సాధించడం కోసం ఆయన వేసే వ్యూహాలు, ఎత్తుగడలు ఆపార్టీలోని కొందరికే కాదు ….బయటి వారికి కూడా అర్థం కావు. రేపు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఏ ప్రణాళికనైనా రచిస్తారు. ప్రణాళికలు రచించడం, వ్యూహాలు, ఎత్తుగడలో వేయడంలో తెలంగాణలో ప్రస్తుతం కెసిఆర్‌కు సాటి ఎవరూరారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే కర్నాటక, గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలపై కెసిఆర్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బిజెపిని చావుదెబ్బ తీయడం కోసం పదునైన వ్యూహాలను కెసిఆర్ సిద్దం చేయనున్నారు. కాగా ఆ రెం డు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తరవాతనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశముందని తెలుస్తోంది. తదనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బిజెపిని ఢీకొట్టేందుకు పూర్తిగా సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News