హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవారి కోసం టిటిడి దేశవ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అన్ని ఆలయాల అభివృద్దికి టిటిడి సహకారం అందించాలన్నారు. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని, చైనాతో సమానంగా జనాభా వున్న భారత్ దేశం అభివృద్దిలో ఏందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. సహజవనరులుతో తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అభివృద్ది చేశారని, బిజెపి అధికారం కోసం మతాని వాడుకుంటుందని, కాంగ్రెస్ పార్టికి నాయకుడే లేడన్నారు. ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తూన్నారని, తెలంగాణ పోరాట సమయంలో కెసిఆర్ ని ఇలానే చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. భవిష్యత్త్ లో కేంద్ర రాజకీయలలో సిఎం కెసిఆర్ విజయం సాధిస్తారని, ప్రధాని పదవి కోసం కెసిఆర్ కేంద్ర రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. దేశ ప్రజలను చైతన్య పర్చడానికి వస్తున్నారని స్పష్టం చేశారు.
ఆ పదవి కోసం కేంద్ర రాజకీయాల్లోకి కెసిఆర్ రావడం లేదు: శ్రీనివాస్ గౌడ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -