Sunday, January 19, 2025

ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి కెసిఆర్ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి సోషల్ మీడియా ద్వారా మరింత చేరువయ్కారు. ఇప్పటివరకు బిఆర్‌ఎస్ పార్టీ పేరుతో ఎక్స్, ఎన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఉండగా, KCRBRSPresident పేరుతో ఎక్స్, ఇన్‌స్టా ఖాతా ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నేత అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ రాష్ట్ర ప్జలకు బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కెసిఆర్ మొదటి పోస్టు చేశారు. ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది ఫాలోవర్లు ఆయనను అనుసరించడం ప్రారంభించారు.

కరెంట్ కోతలపై కెసిఆర్ ట్వీట్
రాష్ట్రంలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రతిరోజూ ఊదరగొడుతున్నారు కానీ, వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని కెసిఆర్ అన్నారు. ఎక్స్ ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే తనకు ఎదురైన సంఘటనను పంచుకున్నారు. మహబూబ్ నగర్‌లో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ వేదికగా తెలిపారు.నియోజకవర్గాల్లో రోజుకు పదిమార్లు కరెంట్ పోతోందని మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని కెసిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని బిఆర్‌ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News