Monday, March 10, 2025

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కెసిఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కెసిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News