Monday, December 23, 2024

తెలంగాణ కోసం పోరాడింది కెసిఆర్ కుటుంబం: మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే ప్రధాని రాష్ట్రానికి వచ్చారని ఫైర్ అయ్యారు. తెలంగాణకు తాము ఏం చేశామన్నది మాత్రం చెప్పలేదని విమర్శించారు. అవినీతిపరులను వెంటేసుకొని మోడీ వచ్చారని మంత్రి కొప్పులు పేర్కొన్నారు.

రాష్ట్ర బిజెపి నేతలు ప్రధానికి రాష్ట్ర అవసరాలు వివరించలేదని మండిపడ్డారు. కుటుంబపాలనపై మాట్లాడే అర్హత మోడీకి లేదని మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడింది కెసిఆర్ కుటుంబం అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఆ బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన, మహాధర్నా కార్యక్రమం చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News