Monday, January 20, 2025

కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్యకు కెసిఆర్ ఆర్థికసాయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కెసిఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకొంటున్న కెసిఆర్ నాడు కిష్టయ్య బిడ్డ ఎంబిబిఎస్ వైద్య విద్యకోసం అవసరమైన ఆర్థికసాయం అందించారు.

నాడు ఎంబిబిఎస్ పూర్తిచేసుకున్న కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఇప్పుడు పిజి చదువుతున్నారు. అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును ఆదివారం నంది నగర్‌లో కిష్టయ్య కుటుంబానికి కెసిఆర్ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కెసిఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా అదుకుంటున్న కెసిఆర్‌కు కిష్టయ్య సతీమణి పద్మావతి,కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక ధన్యవాదాలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News