Monday, January 20, 2025

తెలంగాణ వచ్చాక ఆరోగ్య శాఖ అతికీలకమైందిగా భావించాం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా వంటి విపత్కర పరిస్థితులెదురైనా ఎదుర్కొనేలా వైద్యరంగం బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య సిబ్బంది పని చేయాలని సూచించారు. నిమ్స్‌లో దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. రెండు వేల పడకలతో నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణం చేపట్టామన్నారు. రూ.1571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బ్లాక్ నిర్మాణం జరుగుతోందని కొత్త బ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయని కెసిఆర్ తెలిపారు. రెండో విడత న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కూడా సిఎం కెసిఆర్ ప్రారంభించారు. వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని తెలియజేశారు. ఆరుగురు గర్భిణీలకు న్యటీషన్ కిట్స్ అందజేశారు. తెలంగాణ వచ్చాక ఆరోగ్య శాఖ అతికీలకమైందని భావించామన్నారు. హైదరాబాద్‌కు నాలుగు వైపు నాలుగు ఆస్పత్రులు నిర్మించుకుంటున్నామని, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణం శరవేగంగా సాగుతోందని కెసిఆర్ ప్రశంసించారు.

Also Read: ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News