Friday, January 24, 2025

గ్రూప్ -4 పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

పోటీ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో కెసిఆర్ ఉచిత శిక్షణ శిబిరంలో శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగు యువతి, యువకుల కోసం 91 వేల ఉద్యోగాలు వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇటీవలే గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల కాగా, అందుకు సిద్దిపేటలో గ్రూప్ 4 పోటీ పరీక్షకు ఉచితంగా శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. గతంలో సిద్దిపేట నియోజకవర్గ కెసిఆర్ ఉచిత శిక్షణ శిబిరం ద్వారా కానిస్టేబుల్, గ్రూప్ 2, టీచర్ టెట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చామని అదే తరహాలో ఇప్పుడు కూడా శిక్షణ ఇస్తునట్లు చెప్పారు.

నేటి నుండి 06 – 12 – 2022 నుండి 09 – 12 -2022 రాత్రి 9 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషను చేసుకోటానికి https://forms.gle/3amXuGbYTZZ6TYdG9 లో లాగిన్ అయి అన్ని వివరాలు సడ్మిట్ చేయాలని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ యువతి యువకులకు మంచి అవకాశమని తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ కోరారు. మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను 9030433459,8555032916 సంప్రదించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News