- Advertisement -
కరీంనగర్: చిరు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కరీంనగర్లో పట్టణ ప్రగతిలో భాగంగా 23 టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా పని చేస్తున్నామని, కెసిఆర్ పార్టీ ప్రకటనపై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వడంతో దిగుబడి పెరిగిందని, 80 ఏళ్లలో సాధించని ప్రగతి ఎనిమిదేళ్లలో సాధించి చూపామన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు సాగు తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం కెసిఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
- Advertisement -