హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో టిఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. ”వడ్లు కొంటరా..కొనరా అని అడిగితే ఉలుకుపలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దన్నా. సమస్యలను పక్కకు పెట్టి మతవిద్యేషాలు రెచ్చగొడుతున్నారు. సరిహద్దుల్లో మీరు ఆడుతున్న నాటకాలు తెలుసు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. అనేక సమస్యలను పెండింగ్ లో పెట్టారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్థాన్ అంటూ బిజెపి విద్యేషాలు రెచ్చగొడుతోంది. పదవులు చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది.రైతు కడుపునిండా కరెంటు ఇచ్చేది తెలంగాణ మాత్రమే. వడ్లు పండలేదంటున్న బిజెపి కల్లాల దగ్గరకు ఎందుకు వెళ్తోంది. బిజెపికి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి. మాట్లాడితే కేసులు పెడుతామంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి దండం పెట్టి అడుగుతున్నా. యాసంగిలో వేసిన వడ్లు కొంటరా లేదా చెప్పాలి అని పేర్కొన్నారు.
KCR Full Speech at TRS Maha Dharna