Saturday, December 21, 2024

రైల్ రోకో కేసులో కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రైల్ రోకో కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు విచారణపై స్టే విధిస్తూ విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది.

ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభు త్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2011లో రైల్ రోకోకు పిలుపునిచ్చారని కెసిఆర్‌పై మల్కాజిగిరి పోలీసులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసు కొట్టివేయాలని కెసిఆర్ పిటిషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News