Monday, December 23, 2024

అమెరికాలో కెటిఆర్‌కు ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

KTR in US
లాస్‌ఏంజిల్స్: ఏడు రోజుల పర్యటనపై అమెరికా వెళ్లిన మంత్రి కెటిఆర్‌కు అక్కడ ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన అమెరికా పర్యటన చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఆదివారం తెల్లవారు జామున లాస్‌ఏంజిల్స్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు), టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కెటిఆర్ వారితో రాష్ట్ర అభివృద్ధి విషయమై  కాసేపు చర్చించారు. అంతేగాక రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని వారికి వివరించారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంబాసిడర్లుగా వ్యవహరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News