Monday, December 23, 2024

నర్సాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి.. బీఫామ్ అందజేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఖరారైంది. ఇటీవల ప్రకటించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ టికెట్ ను కెసిఆర్ పెండింగ్ లో ఉంచారు. దీంతో తన సిట్టింగ్ స్థానం తనకే కావాలని ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆశించినా.. పలు చర్చల అనంతరం నర్సాపూర్ టికెట్ ను సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సిఎం కెసిఆర్ బుధవారం సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫామ్ అందజేశారు.

అయితే, మదన్ రెడ్డిని ఎంపిగా అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి మదన్ రెడ్డిని బరిలో దించేందుకు కెసిఆర్, ఆయనను ఒప్పించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News