Friday, March 14, 2025

కెసిఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదు: చామల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ.. బిఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ స్పందించారు. గతంలో బిఆర్‌ఎస్, కెసిఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పుడు తమ స్పీకర్‌ను బిఆర్ఎస్ అవమానించిందని మండిపడ్డారు. కెటిఆర్‌కు దళితులపై ఉన్న ప్రేమేంటో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్‌కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలని పేర్కొన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించి, అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేస్తాననడం సిగ్గు చేటని అన్నారు. కెటిఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని.. రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింప చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News