Tuesday, November 5, 2024

కెసిఆర్ ప్రభుత్వం సకల జన బంధువు: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ప్రభుత్వం సకల జన బంధువని పియుసి ఛైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఏ, టిఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లాఅధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నారు. అన్ని సామాజికవర్గాలను అక్కున చేర్చుకుని ఆ వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నామని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో తాను మంజూరు చేసిన నిధులతో నిర్మిస్తున్న పలు ఫంక్షన్ హాళ్ల నిర్మాణాల పనులను ఎంఎల్‌ఏ గురువారం పరిశీలించారు.

ఈసందర్భంగా కొత్తగా ఆయా కులసంఘాల భవనాల నిర్మాణాలకోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నందిపేట్‌కు చెందిన నాయీ బ్రాహ్మణ సంఘాలు, సిద్దాపూర్ గ్రామ మాదిగ, మాల సామాజికవర్గాల ప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డిని కలిసి తమ సంఘాలభవన నిర్మాణాలకుగాను నిధులు మంజూరుచేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంఎల్‌ఏ ఆయా సంఘాలన్నింటికి ఒక్కొక్క సంఘానికి గాను రూ.5లక్షల చొప్పున వెంటనే మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ఆర్మూర్ అభివృద్ధి, సంక్షేమానికి ఆనవాలుగా అభివర్ణించారు. ప్రతి పల్లెలో అభివృద్ధిసంక్షేమ ఫలాలు విరాజిల్లుతున్నాయని, అన్ని వర్గాల ప్రజల్లో సంతోషంకనిపిస్తోందని అన్నారు. అడ్డదారిలోనైనా అధికారంలోకి వచ్చి ఉచిత పథకాలు వద్దనే పేరుతో రైతుబంధు, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్‌లు, మిషన్ భగీరథ మంచినీళ్లు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు, బతుకమ్మ చీరెల పంపిణీ లాంటి కార్యక్రమాలను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్న బిజెపిని తరిమికొట్టడానికి తెలంగాణ ప్రజలు ఇప్పటినుంచే సంసిద్దంగా ఉండాలని ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్‌ఎస్ నాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News