Monday, December 23, 2024

అన్ని మతాలను గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి : అన్ని మతాలను, కులాలను గౌరవిస్తున్న వారి అభివృద్ధికి కృషి చేస్తున్నా ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ శ్రీశ్రీశ్రీ తుల్భావాని అమ్మవారి దేవాలయంలో బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ, అందరి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి ఒక్క ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలలో సంతరించుకుంటున ఆధ్యాత్మిక శోభ, అదేవిధంగా ఇంతకుముందు ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని ఆయన అన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదగిరిగుట్ల ను అడుగడునా ఆధ్యాత్మికతో కూడుకున్నాట్లు అభివృద్ధి చేసి యాదాద్రిగా పునర్నిర్మాణంతో పాటు రాష్ట్రంలోయున్న బాసర, కొండగట్టు, వేములవాడ, కొలనుపాక తదితర ఆలయాల పునరుద్దరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆలయ చైర్మేన్ మల్లికార్జున శర్మ, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కృష్ణ యాదవ్, నటరాజు, గోవిందా చారి, గోపికృష్ణ, నరేందర్ బల్లా, సందీప్ మరియు కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి ప్రతినిధులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News