Monday, December 23, 2024

సింగరేణి కార్మికులకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర దసరా పండుగకు మూడు రోజుల ముందే సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పింది. పండగకు బోనస్ కింద ఇవ్వాల్సిన రూ.711కోట్లను శుక్రవారం విడుదల చేసింది. ఇది వరకు ప్రకటించిన విధంగానే సంస్థ లాభాల్లో 32శాతం వాటాను సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అందించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కార్మికుల ఖాతాలో బోనస్ డబ్బులను జమ చేశారు. ఒ క్కొక్కరి ఖాతాల్లో రూ.1.53లక్షల బోనస్ ఇవ్వనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పని చేస్తున్న 42వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరబోతున్నది. ఒకటి రెండు రోజుల్లో పండుగ అ డ్వాన్స్ చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. పండుగకు ముందే ఖాతాల్లో నగదు జమ కావడంతో కార్మికులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News