మనతెలంగాణ/జగిత్యాల: సిఎం కెసిఆర్ పాలనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, అన్ని వర్గాల ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల మండలంలోని గుట్రాజ్‌పల్లి గ్రామంలో రెండు గొర్రెల యూనిట్లను బుధవారం జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి ఎంఎల్‌ఎ లభ్దిదారులకు అందజేశారు. అలాగే రూ.5 లక్షల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ఎంఎల్‌ఎ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి, రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం పండగలా ప్రారంభమైందని, ప్రతి గొల్ల, కురుమ కుటుంబానికి గొర్రెలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా అది రాష్ట్ర ప్రజలందరి బాగు కోసమేనని, అన్ని వర్గాల అభివృద్దే కెసిఆర్ ధ్యేయమని అన్నారు. 2014లో సిఎంగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని ఎంఎల్‌ఎ పేర్కొన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కలలు కన్నారని, కుల వృత్తులపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారని కొనియాడారు. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే గొర్రెల పంపిణీ పథకం అని తెలిపారు. గుట్రాజ్‌పల్లి గ్రామానికి 100 గొర్రెల యూనిట్లు వచ్చాయని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు అండగా కెసిఆర్ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
- Advertisement -