Thursday, January 23, 2025

ఆడబిడ్డలకు అన్నీ తానై అండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆడబిడ్డలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్న తపనతో అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. మంగళవారం తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మితో ఇంటి పెద్దలా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తో ఇంటి డాక్టర్‌గా, కేసీఆర్ కిట్ తో మేనమామలా, అమ్మఒడి తో సంరక్షకుడిగా, ఆరోగ్య లక్ష్మితో ఆరోగ్య దాతగా, షీ టీంలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలు భాగస్వామ్యం చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని అన్నారు. బిందెలతో నీటికోసం కిలోమీటర్ల దూరం నడవకుండా, ఇంటికే సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంగన్ వాడి, ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన ఆపద్బాంధవుడని చెప్పారు.

తెలంగాణ మహిళా లోకానికి అన్నగా, తమ్ముడిగా, మేనమామగా, ఇంటి పెద్దగా అన్నీ తానై ఆడబిడ్డకు ఏ ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న మహిళా పక్షకపాతి మన కేసీఆర్ అని ప్రకటించారు. ఈ దశాబ్దంలో మహిళా సంక్షేమంలో దేశంలో తెలంగాణ దరిదాపుల్లోకి కూడా మరే రాష్ట్రం రానంత రీతిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పథకాలను రూపొందించి, దిగ్విజయంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత 9 ఏళ్లలో 13,90,636 మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్ది పొందారని, 6.84 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, 18,46,635 మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందించి స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా, మహిళా సంక్షేమంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలో స్వరాష్ట్రంలో స్త్రీ జాతి సగర్వంగా, సంతోషంగా జీవించడం ఒక మహిళగా నాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.

ఆసరా పెన్షన్లతో అండగా నిలబడ్డ కేసీఆర్ వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడి కార్మికులకు తెలంగాణలో మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. 15, 85, 088 మంది వితంతువులకు నెలకు రూ. 2016 చొప్పున ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 20556.11 కోట్లు పెన్షన్ రూపంలో అందించిందని, 1,43,930 మంది ఒంటరి మహిళలకు రూ.1545.80 కోట్ల పెన్షన్లు అందించిందని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News