Saturday, November 23, 2024

నిరుపేద కాలేయ రోగిని ఆదుకున్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నిరుపేద కాలేయ రోగిని ఆదుకున్న కెసిఆర్
గజ్వేల్‌కు చెందిన పశుల మహేష్‌కు రూ.10లక్షల చెక్కు అందజేసిన మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడికి ఆర్ధిక సాయం చేసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో సదరు యువకుడు కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయ మార్పిడి చేసుకునేందుకు అవసరమైన ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. విషయం తెలుసుకున్న ఆ యువకుడి వైద్య చికిత్సకు సిఎం కెసిఆర్ మానవాతా దృక్పథంతో స్పందించి తక్షణ ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
గజ్వేల్‌లో పశవుల లచ్చయ్య, సుగుణ దంపతుల కుమారుడు మహేశ్(27) కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయ మార్పిడిని సాధ్యమైనంత త్వరగా చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే ఇందుకు పెద్దమొత్తంలో ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించారు. అంత మొత్తంలో డబ్బులు వెచ్చించే పరిస్థితుల్లో లేని ఆ నిరుపేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. సమస్యను తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్ ఈ విషయాన్ని టిఎస్‌ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వీరు వెంటనే ఈ సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సిఎం తక్షణమే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల చెక్‌ను రాసి ఇచ్చారు. ఈ చెక్‌ను మంత్రి హరీశ్‌రావు, వంటే ప్రతాప్‌రెడ్డి మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ముఖ్యమంత్రి నుంచి ఇంత పెద్దమొత్తంలో ఆర్ధిక సహాయం అందడంతో బాధిత కుటుంబంలో ఒక్కసారిగా వెలుగులు నిండాయి. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టిన సిఎం కెసిఆర్‌కు బాధిత కుటుంబం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి హరీశ్‌రావుకు, చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు స్థానిక నేతలకు వారు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి చెక్‌ను అందజేసిన వారిలో స్థానిక కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోడ్డిన్‌తో పాటు పలువురు టిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

KCR grants Rs 10 lakhs for siddipet youth liver transplant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News