Monday, December 23, 2024

యావత్ దేశ ప్రజలకు కెసిఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో కొత్త “ప్రజా రాజకీయాలు” , పాలనకు కొత్త సంవత్సరం నాంది పలకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక వృద్ధికి… 2023 మార్గం సుగమం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధ్యక్షుడు తెలంగాణ ప్రజలతో పాటు,  యావత్ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

గతాన్ని సమీక్షించడం, వర్తమానాన్ని విశ్లేషించడం, భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోవడం ద్వారా జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురాగలమని కెసిఆర్ పేర్కొన్నారు. “యువత వారి స్వంత నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకోవాలి, వారి ఆశయాలను సాధించడానికి ముందుకు సాగాలి. జీవితం పట్ల సరైన దృక్పథం, దృఢ సంకల్పం ఉన్నప్పుడే లక్ష్యాలను చేరుకోవడంలో విజయం సాధించవచ్చు” అని ఆయన అన్నారు. అవరోధాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి పథం అందరికీ రోల్ మోడల్‌గా నిలుస్తోందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. 2023లో కొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కెసిఆర్ ఆకాంక్షించారు. ఇదిలావుండగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News