Saturday, November 23, 2024

కెసిఆర్‌కు ప్రధాని అయ్యే అర్హతలు ఎన్నో ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

ఆయనను తక్కువ అంచనా వేయొద్దు
విపక్షాలకు ఒవైసి హితవు

మళ్లీ బిఆర్‌ఎస్‌దే అధికారం : ఒవైసీ

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ మరోసారి అధికారంలోకి రానున్నారని ఎంఐఎం చీప్, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ జోస్యం చెప్పారు. సిఎం కెసిఆర్‌కు ప్రధాన మం త్రికి ఉన్న లక్షణాలు మెండుగా ఉన్నాయని ఆయనను విపక్ష పార్టీలు తక్కువగా అంచనా వేయవద్దని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితమైతుందని ఎద్దేవా చేశారు. చాలా జిల్లాలో బీజేపీకి బలం లేదని, క్యాడర్ అసలే లేద ని త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ స్ధానా లు పెంచుకుంటామని పేర్కొన్నారు. దేశ చరిత్ర లో తొలిసారి సచివాలయంలో సిఎం కెసిఆర్ మ సీదు, మందిర్, చర్చి నిర్మించారని ప్రశంసించారు. ఈకట్టడాలు అద్భుతంగా కట్టారని కొనియాడారు. అంతేగాకుండా వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని పేర్కొన్నారు. అతని రాజకీయ చతరుత ముందు ఎవరూ నిల్వలేరని, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గాయన్నారు. దేశంలో కూడా తెలంగాణలాంటి విజన్ కావాలని దేశంలో మూడో ఫ్రంట్ రావాల్సిన అవసరం ఎంతైన ఉం దని అభిప్రాయపడ్డారు.

తమకు బలం ఉన్నచోట తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏరాష్ట్రంలోనైనా మసీదు కూల్చితే మళ్లీ కట్టారా అని ప్రశ్నిస్తూ మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తోందన్నారు. రెసిడెన్షియల స్కూ ల్స్‌లో మైనార్టీ పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారని పేర్కొన్నారు. సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్ తమిళిసైతో కలిసి సిఎం కెసిఆర్ ప్రారంభించిన కార్యక్రమంలో ఒవైసీ సోదరులు పాల్గొన్నారు. అదే విధంగా ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు కురిపించారు.

బ్రిక్స్ సదస్సులో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య జరిగిన అనధికారిక సంభాషణ ఉద్దేశిస్తూ మోదీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయిందని ఆరోపించారు. సరిహద్దు వివా దం దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని ఇదేమీ మోదీ ఒక్కడికే చెందిన వ్యక్తిగత విషయం కాదని దీనిపై పార్లమెంట్ లో ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. లడఖ్ సరిహద్దులో వాస్తవ పరిస్థితులపై దేశాన్ని అంధకారంలో ఉంచుతూ చైనా అధ్యక్షుడితో ప్ర ధాని సమావేశం అవ్వడం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. సరిహద్దు వివాదాలపై భారత్ ద్వైపాక్షిక చర్చలు జరపాలని చైనా కోరుకుంటుందని బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్ పింగ్ మధ్య అనధికారిక చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు కొనసాగాలంటే, ఎల్‌ఓసి విషయంలో గౌరవంగా ఉంటాని మోదీ సూచించినట్లు తెలిసింది. కానీ ఒవైసీ మాత్రం ఈ భేటీని మోదీ ప్రభుత్వం చైనా ముందు లొంగిపోయినట్లు అభివర్ణించారు. ఇదే సమయంలో భారతీయ సైనికులపై మోదీకి విశ్వాసం లేదా అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News