హైదరాబాద్ : సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం సమైక్య పాలకుల కబంద హస్తాల నుండి స్వాతంత్య్రం తెచ్చుకుంది తెలంగాణ. ఆరు దశాబ్దాల ఉద్యమ ఫలితం సాకారం అయిన రోజు నేడు. అమరవీరుల ఆత్మహత్యలు, ప్రాణాలని సైతం లెక్క చేయని కెసిఆర్ దీక్షతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ జూన్ 2తో తెలంగాణ 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మొత్తం సిఎం కెసిఆర్ నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా ట్విట్టర్‌లో కెసిఆర్ పేరు టాప్ ట్రెండింగ్‌లో రన్ అయ్యింది. తెలంగాణ బానిస సంకెళ్లని పట్టువదలని విక్రమార్కుడిలా విడిపించిన కెసిఆర్‌కి పెద్ద ఎత్తున నెటిజన్స్ కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ నెటిజన్లు ట్విట్టర్‌లో ‘జై కెసిఆర్’ అనే హాష్‌ట్యాగ్‌తో వేలాది ట్వీట్లు చేశారు. దాంతో గురువారం ఈ హాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మొత్తం 72 వేల మంది నెటిజన్లు ఈ హాష్‌ట్యాగ్‌తో హోరెత్తించారు. అలాగే, ‘తెలంగాణ ఫార్మేషన్ డే’ హాష్‌ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో నిలచింది. ఈ హాష్‌ట్యాగ్‌తో 25 వేల మంది ట్వీట్లు చేశారు. 60 ఏళ్ల తమ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలు ట్వీట్లతో ధన్యవాదాలు తెలిపారు.
ట్విట్టర్ టాప్ ట్రెండింగ్‌లో కెసిఆర్ హాష్‌ట్యాగ్..!
- Advertisement -
- Advertisement -
- Advertisement -