Monday, January 20, 2025

డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత కెసిఆర్‌కు లేదు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ వద్ద దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు ఆవిష్కరించనున్నారు. అయితే ‘కెసిఆర్ దళిత ద్రోహి అని…ఆయనకు విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత లేదు’ అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కెసిఆర్ ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నించారు.

త్వరలో ఎన్నికలు జరుగనున్న కారణంగానే అంబేడ్కర్ విగ్రహం పేరిట రాజకీయాలకు తెర లేపారని బండి సంజయ్ విమర్శించారు. కాగా ప్రధాని మోడీ పాలనలో పథకాలు దళితులకు అందుతున్నాయని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News