Saturday, February 22, 2025

కెసిఆర్ తుంటి ఎముక విరిగింది: వైద్యులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై యశోద వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాత్‌రూమ్‌లో జారిపడడంతో కెసిఆర్ తుంటి ఎముక విరిగిందని పేర్కొన్నారు. కెసిఆర్ ఎడమ తుంటి ఎముక విరిగిందని, కెసిఆర్ ఎడమ తుంటి ఎముక మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. కెసిఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందన్నారు. కెసిఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని యశోదా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News