Monday, January 20, 2025

మరాఠా నేలపై గులాబీ రెపరెపలు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని నాగపూర్‌లో బిఆర్‌ఎస్ తొలి ఆఫీస్‌ను ప్రారంభించిన కెసిఆర్
జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్‌ను సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వాదం
భారీగా తరలివచ్చిన శ్రేణులు

సంస్కరణే బిఆర్‌ఎస్ మిషన్ అని, అన్నిరంగాల్లో సంస్కరణలు జరిగేతేనే దేశంలోని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. దేశం మారాల్సిన సమయం వచ్చేసిందని, ఆలోచన తీరు మా రకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదన్నారు. మహారాష్ట్ర నాగపూర్ లో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఛత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బిఆర్. అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, బసవేశ్వరుడు, అన్నా బహుసాటే చిత్రపటాలకు కెసిఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

అం తకుముందు సురేష్‌భట్ ఆడిటోరియంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులకు పార్టీ కండువా కప్పి బిఆర్‌ఎస్ పార్టీలోకి కెసిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళుతోందని కెసిఆర్ ప్రశ్నించారు. ఈ విషయం ఆలోచిస్తే తనకు భయమేస్తోందన్నారు. చైనా దేశాన్ని అధిగమించి జనాభాలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా మనదేశం అవతరించిందని కెసిఆర్ తెలిపారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రజలను అపహాస్యం చేసే విధంగా రాజకీయ నాయకుల పోకడలున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడ మే దేశ లక్ష్యంగా పరిణమించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News