Sunday, December 22, 2024

చరిత్ర పుటల్లో చెరగని రికార్డులు

- Advertisement -
- Advertisement -

రాజకీయ నాయకుడు అంటే రాజకీయం చేయడం ఒక్కటే కాదు. ప్రజలను గెలిపించే నాయకుడు నిజమైన నాయకుడు అంటారు. ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన నాయకుడిని ప్రజా నాయకుడిగా గుర్తిస్తుంది. ఒక రాష్ట్రాన్ని సాధించిన నేతను పోరాట యోధుడిగా చరిత్రలో నిలుస్తారు. గమ్యాన్ని ముద్దాడే వరకు మడమ తిప్పని పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మూడవ సారి ముఖ్యమంత్రిగా దక్షిణాది చరిత్ర పుటల్లో రికార్డు సృష్టించబోతున్న నాయకుడు కెసిఆర్. దేశానికి తెలంగాణ మోడల్‌ను పరిచయం చేసిన ఘనత ఆయనది. తొమ్మిదిన్నర ఏండ్లలో రాష్ట్ర ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలిచింది.

తెలంగాణ పోరాట యోధుడు కెసిఆర్ రికార్డులు దేశ చరిత్రలో లిఖించబడుతాయి. బహుశా దేశంలో సంచలనాలు సృష్టించడంలో కెసిఆర్‌కే సాధ్యం. దాదాపు 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ప్రత్యేకం. అడుగు ముందుకు పడింది అంటే విజయం తీరాలకు చేరుతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. ఆయన రికార్డులు ఆయనే తిరగ రాశా రు. కెసిఆర్‌కు సాటి రారు ఎవ్వరూ. 1982లో స్వల్ప మెజారిటీతో ఓటమి చెంది, ఆ ఓటమి నుండే గెలుపు బాట పట్టారు. 1985లో 16 వేల 156 ఓట్ల మెజారిటీతో సిద్దిపేట నియోజకవర్గం ఎంఎల్‌ఎగా ఎన్నిక య్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రికార్డులు సాధించారు.వరుసగా 1989లో 13 వేల 816 ఓట్ల మెజారిటీతో, 1994లో 27 వేల 107 ఓట్ల మెజారిటీతో, 1999లో 27 వేల 555 ఓట్ల మెజారిటీతో టిడిపి నుండి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు.

ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి పురుడు పోశారు. తన ఎంఎల్‌ఎ, డిప్యూటీ స్పీకర్ పదవులకు రాజీనా మా చేసి 2001లో టిఆర్‌ఎస్ (బిఆర్‌ఎస్) స్థాపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాన్ని నడిపారు. నాడు సిద్దిపేట ఉప ఎన్నికల్లో 58 వేల మెజారిటీ ఘన విజయం సాధించి ఉద్యమానికి ఊపిరిలూదారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 44 వేల 668 మెజారిటీతో సిద్దిపేట నుంచి ఎంఎల్‌ఎగా, కరీంనగర్ ఎంపిగా బరిలో నిలిచి లక్షా 31 వేల 168 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి విద్యాసాగర్ రావుపై ఘన విజయం సాధించారు. తెలంగాణ కోసం దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంట్ సభ్యునిగా ఉండాలని, సిద్దిపేట శాసన సభ్యుడిగా రాజీనామా చేసి అక్కడ హరీశ్ రావుకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పడ్డాయి.

రాష్ట్రంలో, కేంద్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేరింది. కేంద్ర మంత్రులుగా కెసిఆర్, ఆలే నరేంద్ర లు, రాష్ట్రంలో హరీశ్ రావుతో పాటు మొత్తం ఆరుగురు మంత్రివర్గంలో చేరారు. తెలంగాణ కోసం యుపిఎ ప్రభుత్వంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాం లో తెలంగాణ అంశం చేర్చింది. కాలయాపన చేస్తున్న సందర్భంలో 2006లో కరీంనగర్ ఎంపి గా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో 2 లక్షల 10 వేల 582 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మళ్ళీ ఇక్కడి నుండి 2008లో 15 వేల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపిగా 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. మహబూబ్ నగర్ ఎంపిగా ఢిల్లీకి వెళుతూ రాష్ట్రాన్ని తెస్తా అంటూ తెచ్చి చూపించారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మెదక్ ఎంపిగా 3 లక్షల 97 వేల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి పోటీ చేసిన రెండింటిలో గెలిచారు. రాష్ట్రంలో 63 స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2018లో జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ నాయకత్వంలో 88 స్థానాల్లో విజయ ఢంకా మోగించి అధికారంలోకి వచ్చింది. కెసిఆర్ గజ్వేల్ నుండి 58 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. తదనంతరం సిఎం కెసిఆర్ దేశం కోసం గత అక్టోబర్ 9న టిఆర్‌ఎస్‌ను భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) జాతీయ పార్టీగా అవతరించింది. ఈ 2023 ఎన్నికల్లో సైతం కెసిఆర్ నాయకత్వంలో తిరిగి భారీ మెజారిటీతో 78 నుండి 90 స్థానాల్లో విజయం సాధించే దిశగా బిఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం మొదలైంది.

కెసిఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో లక్ష చొప్పు న మెజారిటీతో ఘన విజయం సాధించనున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇలాంటి రికార్డులు అందరికీ సాధ్యం కావు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయం చేయడం ఒక్కటే కాదు. ప్రజలను గెలిపించే నాయకుడు నిజమైన నాయకుడు అంటారు. ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన నాయకుడిని ప్రజా నాయకుడిగా గుర్తిస్తుంది. ఒక రాష్ట్రాన్ని సాధించిన నేతను పోరాట యోధుడిగా చరిత్రలో నిలుస్తారు. గమ్యాన్ని ముద్దాడే వరకు మడమ తిప్పని పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మూడవ సారి ముఖ్యమంత్రిగా దక్షిణాది చరిత్ర పుటల్లో రికార్డు సృష్టించబోతున్న నాయకుడు కెసిఆర్.

దేశానికి తెలంగాణ మోడల్‌ను పరిచయం చేసిన ఘనత ఆయనది. తొమ్మిదిన్నర ఏండ్లలో రాష్ట్ర ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాళేశ్వరం, పాలమూరు వంటి అనేక జల ప్రాజెక్టులు కట్టిన ప్రదాత కెసిఆర్, అభివృద్ధి సంక్షేమాన్ని పాలు నీరు లాగా ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్తున్న నాయకుడు కెసిఆర్ ఒక్కరే దేశంలో అగ్రభాగాన నిలుస్తారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజల గుండెల్లో నిలవడం శాశ్వతం అంటారు కెసిఆర్. తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామా చేసి తాను తిరిగి గెలవడం కాదు, తన పార్టీ ఎంఎల్‌ఎలను కూడా తిరిగి గెలిపించుకున్న రికార్డు కెసిఆర్ సొంతం.

చిటుకుల మైసారెడ్డి
9490524724

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News