Monday, December 23, 2024

కోటి వృక్షార్చనకు నేడు కెసిఆర్ శ్రీకారం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా 9వ విడత హరితహారం
మంచిరేవుల ఫారెస్ట్ రేక్ పార్క్‌లో ఎన్నో ప్రత్యేకతలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు.. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫారెస్ట్ రేక్ పార్కులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26న ఒక రోజు, ఒక కోటి మొక్కలు రాష్ట వ్యాప్తంగా నాటే కార్యక్రమం జరగనున్నది. చిలుకూరు బ్లాక్‌లోని మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పార్క్ లో మొక్క నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనకు సంబంధిత కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు.
ఫారెస్ట్ రేక్ పార్క్ ప్రాధాన్యతలు..
మంచిరేవులలోని ఫారెస్ట్ రేక్ పార్కు మొత్తం విస్తీర్ణం 256 ఎకరాల.. ఈ ప్రాంతం గతంలో భవన నిర్మాణ వ్యర్థాలతో నిండి ఉండేది. వ్యర్థాలతో వచ్చే దుర్వాసన ఈ ప్రాంత వాసులకు జఠిల సమస్యగా మారడంతో.. ప్రభుత్వం చొరవ చూపి.. పార్కుగా అభివృద్ధి చేసింది. దీంతో అటవీ సంరక్షణ, పార్కు పునరుజ్జీవన పనులను చేపట్టారు. వివిధ రకాలకు చెందిన 50 వేల మొక్కలు నాటారు, నిర్మాణ శిథిలాలను తొలగించిన తర్వాత, ఆ ఖాళీ ప్రదేశాలలో ‘పొద’ జాతికి చెందిన 25 వేల మొక్కలు నాటారు. రాక్‌ఫిల్ డ్యామ్‌లు, 3 చోట్ల నీటి కుంటలు నిర్మించారు. ఈ ప్రాంతంలో భూసారం, నీటి సంరక్షణ చర్యలతో అటవీ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. మొత్తం 5.6 కి.మీ మేర విస్తరించి ఉన్న పార్కుకు 4.5 కి.మీల ప్రహరి గోడను నిర్మించారు. సందర్శకులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తాగునీటి ప్లాంట్, 4 ట్రెక్కింగ్ మార్గాలు (2 కి.మీ), నడక మార్గాలు (4 కి.మీ), టాయిలెట్ బ్లాక్, గెజిబో(2), వాచ్ టవర్, గ్రామ దేవత గుడి, ఓపెన్ వ్యాయామశాల, హంఫీ థియేటర్, జలపాతం, బ్యాలెన్సింగ్ రాళ్ళు, పిల్ల ఏనుగు, డేగ ముఖం, రచ్చ బండలు, సిటింగ్ బెంచీలు, మూడు చోట్ల నీటి వనరులు… వీటి కోసం మొత్తం పెట్టుబడి రూ. 7.38 కోట్లు వ్యయం చేశారు. ఈ పార్కులో 11 మందికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధి కల్పించనున్నారు. నెలకు దాదాపు రూ.3 లక్షల ఆదాయం రానున్నది. మరింత ఆకర్షణ కోసం చిన్న చిన్న కొండలు నిర్మించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News