Friday, November 22, 2024

సచివాలయ నిర్మాణం సుపరిపాలనకు అద్దంపట్టాలి

- Advertisement -
- Advertisement -

KCR inspects work on the new Secretariat

ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించేలా ఉండాలి
త్వరితగతిన నిర్మాణపనులు పూర్తిచేయండి
ముందస్తు వ్యూహంతో సామగ్రి సమకూర్చుకోండి
నూతన సెక్రటేరియెట్ నిర్మాణ పనులను నలుమూలలా తిరుగుతూ పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన అత్యంత పారదర్శకంగా సాగుతున్నదని, అత్యాధునికత సాంకేతికత విధానాలను అందిపుచ్చుకుని సౌకర్యవంతమైన రీతిలో ప్రజల వద్దకే పాలనా ఫలాలు చేరుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన రీతి లో సుపరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో, అందుకు తగ్గట్టుగా రూపొందించి సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం ఆదేశించారు. శనివారం సచివాలయ నిర్మాణ ప నుల పురోగతిని సిఎం కెసిఆర్ పరిశీలించారు. ఆయన నలుమూలలా కాలి న డకన మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం సిఎం కెసిఆర్ సమీక్ష చేశారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఏడేండ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో సాగుతున్న ఆదర్శవంతమైన పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా ఉండాలన్నారు. అలాగే రాష్ట్ర గౌర వం ఉట్టిపడేలా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో, సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం ఉండబోతోందని తెలిపారు. ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కలనుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ ను నిర్మించాలన్నారు.

విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా ఉండాలన్నారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దర్వాజలు, కిటికీలు, తదితర ఫర్నిచర్, విద్యు త్, ప్లంబింగ్ టైల్స్ వంటి సచివాలయ నిర్మాణంలో వినియోగించే అన్ని రకాల విభాగాలకు చెందిన ఇంటీరియర్ మెటీరియల్ ను ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. తద్వారా పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించడానికి వీలవుతుందన్నారు.సచివాలయం ముఖద్వారాన్ని, బయటి గేటు నిర్మాణాలను, వాటికి అమర్చవలసిన గ్రిల్స్ తదితర అంశాలను,సిఎం కెసిఆర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రహరీ గోడలకు అమర్చాల్సిన లాంప్ పోస్టుల గురించి సూచనలిచ్చారు. విశాలంగా నిర్మిస్తున్న కారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సిఎం, సిఎస్‌తో సహా మంత్రుల కార్యాలయాలు, ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు. సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇతర రా్రష్ట్రాలనుంచే కాక, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రముఖుల కోసం నిర్మితమౌతున్న‘వెయిటింగ్ హాల్’ ల నిర్మాణాల తీరును, సందర్శకులు కూర్చునే ప్రదేశాలను కూడా సిఎం పరిశీలించారు.

సందర్శకుల సౌకర్యాలు, పార్కింగ్‌పై ఆరా

పార్కింగ్ వ్యవస్థ గురించి సిఎం కెసిఆర్ ఆరాతీశారు. కార్లు, టూ వీలర్స్, బస్సులు తదితర వాహనాల పార్కింగు స్థలాలను పరిశీలించారు. హెలీపాడ్ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్ కు వచ్చే విఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సిఎం వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ నిర్మాణంలో కీలకమైన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టి పై అంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.

అందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో చర్చించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సిఎం కెసిఆర్ సూచించారు. సచివాలయ సందర్శనలో సిఎం కెసిఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు సి.లకా్ష్మరెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రేగా కాంతారావు, అంజయ్యయాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి, హన్మంత్ షిండే, రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రోడ్లు భవనాల ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్, నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి ప్రతినిధులు, ఇంజనీర్లు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News