Wednesday, January 22, 2025

రంగంలోకి గులాబీ బాస్

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారు
15న హుస్నాబాద్‌తో శ్రీకారం

నవంబర్ 9 వరకు 16 రోజులు బహిరంగ సభలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల షె డ్యూలు విడుదల కావడంతో బిఆర్‌ఎస్ వేగం పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జి ల్లాలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) బహిరంగ సభల ను నిర్వహించనుంది. ఈ నెల 15 నుంచి గులాబీ బాస్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓ వైపు మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు.. మరోవైపు అభ్యర్థులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. ఈనెల 15 నుంచి గులాబీ దళపతి రంగంలోకి దిగనున్నారు. ఈ మే రకు సిఎం కెసిఆర్ 16 రోజుల ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. ఈనెల 15 వ తేదీన హుస్నాబాద్ తో మొదలయ్యే తొలిదశ ప్రచార పర్వం నవంబర్ 8వ తేదీన బెల్లంపల్లిలో ముగుస్తుంది. సిఎం కెసిర్ ఒక్కో రోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటారు. తొలి విడతలో 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇ ప్పటికే అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థులను బిఆర్‌ఎస్ అధినేత ఖరారు చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల మొ దటి దశ ప్రచారపర్వం ఇప్పటికే ముగియగా, అధినేత పాల్గొనే సభలతో ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే మంత్రులు కెటిఆర్,హరీశ్ రావులు సైతం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు సిఎం కెసిఆర్ స్వయంగా బరిలోకి దిగి ప్రచార పర్వం మొదలు పెడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల జోరు ఊపందుకోనుంది. కనీసం వేరే రాజకీయ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉండగా, ప్రతిపక్షాలు ఒకడుగు వేసేలోపే బిఆర్‌ఎస్ వంద అడుగులు వేసే పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, ప్రచారంలో బిఆర్‌ఎస్ వేగం పెంచడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కనుంది.
2018లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభం
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు ఈ నెల 15వ తేదీన హుస్నాబాద్‌లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 2018 ఎన్నికల స మయంలో కూడా హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన గులాబీ బాస్, ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను అనుసరిస్తూ అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు జనగామ, మధ్యాహ్నం 2 గం టల నుంచి 3 గంటలకు భువనగిరిలో జరిగే బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. 17న సిద్దిపేట మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్ల, మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట, 18న మధ్యాహ్నం 2 గంటలకు జ డ్చర్లలో.. మధ్యాహ్నం 3 గంటలకు మేడ్చల్ బహిరంగ సభల్లో గులాబీ దళపతి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొంతమంది విరామం ఇచ్చి ఈ నెల 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్, మునుగోడులో సభలలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. అలాగే ఈ నెల 27న పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈ నెల 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్, 31 న హుజుర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలలో, నవంబర్ 1న సత్తుపల్లి, యెల్లందు సభలలో, నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి సభలలో, వచ్చే నెల 3న భైంసా(ముధోలె), ఆర్మూర్, కోరుట్ల సభలలో 5న కొత్తగూడెం, ఖమ్మం సభలలో, 6న గద్వాల్, మక్తల్, నారాయణ్‌పేట్, 7న చెన్నూర్, మంథని, పెద్దపల్లి, 8న సి ర్పూర్, అసిఫాబాద్, బెల్లంపల్లి సభలలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.
9న ఒకే రోజు రెండు చోట్ల సిఎం నామినేషన్లు
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నవంబర్ 9వ తేదీన రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో కెసిఆర్ మొదటి నామినేషన్ దాఖలు చేసి, కామారెడ్డిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో రెండవ నామినేషన్ సమర్పించనున్నారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో భాగంగా సిఎం కెసిఆర్ వచ్చే నెల 9వ తేదీన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News