తమిళనాడు సిఎం తరఫున
ఆహ్వాన అందించిన ఎంపి గిరిరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును తమిళనాడు సిఎం ఎం.కె.స్టాలిన్ ఆ హ్వానించారు. ఈ మేరకు డిఎంకె పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరి రాజాన్ ద్వారా సిఎం స్టాలిన్ శుక్రవారం ప్రగతి భవన్‌కు ఆహ్వాన లేఖను పంపించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి 28 జులై నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా సిఎం కెసిఆర్‌ను తమిళనాడు సిఎం కోరారు. ఈ సందర్భంగా డిఎంకె ఎంపి గిరి రాజాన్, సిఎం కెసి ఆర్‌కు శాలువా కప్పి, జ్ఞాపికను అందచేశారు. ఆహ్వాన పత్రికను అందించారు. 188 దేశాల చెస్ క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు, భారత్‌లో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్న పోటీలని లేఖలో సిఎం స్టాలిన్ పేర్కొన్నారు.