Tuesday, November 5, 2024

సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం జెవి.ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టరు గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సంధర్భముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి జూన్ 22 వరకు నిరవహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఘనంగా సింగరేణి సంబురాలు జరిగాయి.

ముందుగా కొత్తగూడెం ఏరియా సింగరేణి జిఎం జక్కం రమేష్, సత్తుపల్లి జిఎం క్యాంప్ ఆఫీస్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రొ.జయశంకర్ తెలంగాణ తల్లికి పూల మాలలు వేసి అలంకరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. గనుల అధిపతులు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ గేయాన్ని ఆలపించారు. అనంతరం సింగరేణి జిఎం క్యాంప్ ఆఫీస్ నుండి సత్తుపల్లి బియూఎస్ స్టాండ్ వద్ధ గల తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ సంసృ్కతి ఉట్టి పడేలా ఈ రన్‌లో టార్చ్‌ను పట్టుకొని, బతుకమ్మలు, బోనాలు, లంబడా డాన్స్, కొమ్ము-కోయ డాన్సులు చేస్తూ తెలంగాణ రన్ నిర్వహించారు.

జేవిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ నందు జాతీయ జెండాను ఆవిష్కరించుకొని జాతీయ గీతాన్ని ఆలపించారు. హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా కలెక్టర్ పి.వి.గౌతమ్, ఐఏఎస్ జేవిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే సింగరేణి సంబురాల కార్యక్రమానికి హాజరయ్యి ముందుగా బెలూంలు పావురాలను ఎగురవేశారు. సభా ప్రాంగణము నందు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, సేవ ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు స్టాల్స్ ప్రారంభించారు. అదే విధముగా తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ తొమ్మిది సంవత్సరాలలో సింగరేణి లో జరిగిన అధ్బుత ప్రగతి ని తెలియ చేసే సిడి అధ్బుత ప్రగతి బుక్స్‌ను ఆవిష్కరించారు.

ఈ సంధర్భముగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి బొగ్గు గనులను కాపాడుకున్న గొప్ప నాయకుడని, కెసిఆర్ బాటలో సింగరేణి లాభార్జన ఉందన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సత్తుపల్లి నుండి కొత్తగూడెంకు బొగ్గు రవాణా కొరకు 928 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే లైన్ ఏర్పాటు చేయటం వలన రోడ్డు ప్రమాదాలు నివారించటమే కాకుండా వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని కూడా తగ్గించారని, సిఎస్‌ఆర్ నిధుల ద్వారా పరిసర గ్రామాలలో అభివృద్ది పనులను చేపట్టడం చాలా సంతోషం అన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆర్‌డిఓ సూర్యనారాయణ, ఏసిపి ఎన్.వెంకటేష్, కొత్తగూడెం ఏరియా లోని అధికారులు, టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, 5 జాతీయ సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News