Thursday, January 23, 2025

ప్రజాసేవకై పాటుపడే నాయకుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రెంజల్: ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజాసేవకై పాటుపడే దార్శనికుడు సిఎం కెసిఆర్ అని ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మండలంలోనిసాటాపూర్ గ్రామంలో పర్యటించన ఎమ్మెల్యే షకీల్‌ను సర్పంచ్ వికార్‌పాషా గజమాలతో ఘనంగా సత్కరించారు. గ్రామస్తులు మంగళవాయిద్యాలతో బోనాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ.22.48లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.25లక్షలతో నిర్మించిన మైనారిటీ ఈద్గా ప్రహరీగోడను ప్రారంభించారు. నాబార్డు నిధుల ద్వారా మంజూరైన రూ.15లక్షలతో ఏర్పాటు చేసే మార్కెట్ షెడ్‌కు భూమి పూజ చేశారు. 22లక్షలతో ఏర్పాటుచేసిన రైతు వేదికను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిజెపి అసత్యప్రచారాలు చేస్తే సహించేదిలేదని అన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ వికార్‌పాషా, ఎంపిటిసి హైమద్, ఉప సర్పంచ్ లత సాయిలు, సర్పంచుల సంఘ మండల అధ్యక్షుడు రమేష్‌కుమార్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, జడ్పీ వైస్‌ఛైర్మన్ రజిత యాదవ్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు డా.తెలంగాణ శంకర్, మండల సర్పంచ్‌లు సాయారెడ్డి, కలింబేగ్, రాజు, సాయిలు, సునీత, బాబునాయక్, విండో ఛైర్మన్లు మోహినుద్దీన్, ఇమామ్‌బేగ్, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News