సూర్యాపేట: ప్రతిక్షణం ప్రజల గురించి పరితపించే ప్రజాభిమాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం అవరణలో బర్త్ డే వేడుకలను బీఆర్ ఎస్ శ్రేణుల తో కలిసి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయిర్ ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆయా మతాలకు చెందిన పెద్దలు ప్రార్దనలు నిర్వహించారు.అనంతరం 70కేజీల బారీ కేక్ ను కట్ చేసిన మంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపార.
ఈ సందర్బంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.. పేదలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా అధునాతన వసతులతో కూడిన అంబులెన్స్ ను జాతికి అంకితం ఇచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా వికలాంగులలకు ట్రై మోటార్ సైకిళ్ళ ను ప్రారంబించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కేసీఆర్ కు అత్యంత ప్రీతికరమైన హరితహరం కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి చెట్లు నాటి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అలుపెరుగని పోరాట యోధుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్య మంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
అనితర సాధ్యమైన విజయాలను తనదైన పద్దతుల్లో ప్రజలకు చేరువ చేసిన గొప్ప పరిపాలన దక్షకుడు అన్నారు.తెచ్చిన రాష్ట్రాన్ని దేశానికే తలమానికం గా తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు.సంక్షేమం – అభివృద్ధి ని సమపాళ్ళలో ముందుకు తీసుకెలుతూ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న కేసీఆర్ గారి పాలన కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ తరహా అభివవృద్ధి కోసం దేశ ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ల నుండి పుట్టిందే బీఆర్ఎస్ అన్న మంత్రి ,దేశాన్ని పాలించే విధంగా కేసీఆర్ గారికి భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు పూజలు , సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.కేసీఆర్ దేశ ప్రజలకు సేవ చేయాలనేదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు..