- పరిగిలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి: రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు నిరంతర విద్యుత్‌ను అందిస్తుంటే పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అన్ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నేషనల్ హైవేపై గురువారం నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ నాయకులు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతాంగం పట్ల తెలంగాణలో రైతులకు మూడు గంటలే కరెంట్ చాలని మాట్లాడిన రేవంత్‌రెడ్డికి గత మూడు రోజులుగా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కణలు తీసుకవచ్చి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును తీసుకవచ్చిన ఘనత కేసిఆర్‌దేనని అన్నారు.
రూ. 72 వేల కోట్లు రైతుల ఖాతాలో 11 సార్లు వేయడం జరిగిందన్నారు. రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం అందస్తున్నామని, రైతులకు గుంట భూమి ఉన్న రైతుబీమా పథకం అమలు చేసిన ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. ధరణి పోర్టల్ తీసుకవచ్చి రైతుల సమస్యలను పరిష్కరించామన్నారు. మొదట 9 గంటలు కరెంట్ ఇచ్చిన కేసిఆర్ రెండవ దఫాలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. రాజకీయ నాయకులు తమ ఉనికిని కోల్పోతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎదో ఒకటి చెప్పి ప్రజలను పక్కదారి పట్టించేలా చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వస్తే విద్యుత్ మూడు గంటలే ఇస్తామన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని వారి మ్యానిఫెస్టోలో ఉంచుతామన్నారని అన్నారు. కేసిఆర్ ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందకున్న మీటర్లు పెట్టమని అసెంబ్లీ సాక్షీగా కేసిఆర్ చెప్పారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్, ఎంపిపి కరణం అరవింద్‌రావు, జడ్‌పిటిసి హారిప్రియా ప్రవీణ్‌రెడ్డి, వైఎస్ ఎంపిపి సత్యనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, సొసైటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ రాజేందర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్‌పల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు కిరణ్, వారాల రవీందర్, ఎదిరే కృష్ణ, నాగేశ్వర్, మున్నీర్, వెంకటేష్, రవికుమార్, యువ నాయకులు బషీర్, సంతోష్, ఆసీఫ్, నితీన్, బలాల, ఆయా మండలాల గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.