Wednesday, January 22, 2025

కెసిఆర్ దేశానికే ‘ఆదర్శం’

- Advertisement -
- Advertisement -

KCR is an ideal for the country:KTR

దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా
ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా?

కెసిఆర్ ఏ ఆలోచన చేసినా కార్యక్రమం తీసుకున్నా అవి దేశంలోని అన్ని
రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారాయి మండలంలో 155
డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో గృహప్రవేశం చేయించిన సందర్భంగా కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల : ప్రతిపక్ష నాయకులకు, తెలివుంటే, ధైర్యముంటే దేశంలోని తెలంగాణ మినహ మిగిలిన 27 రాష్ట్రాల్లో ఎక్కడైనా సిఎం కెసిఆర్ అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో వివరించాలని మున్సిపల్, ఐటి, చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మించిన 155 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లల్లో గృహప్రవేశాలు చేయించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా, దేశంలో మరెక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, కెసిఆర్ కిట్, డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు, మిషన్ భగీరథ వంటి అనేక పథకాలకు రూపకల్పన చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కె దక్కిందన్నారు. సిఎం కెసిఆర్ ఏ ఆలోచన చేసినా, ఏ కార్యక్రమం తీసుకున్నా అది దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారిందన్నారు.

కెసిఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు మాట ఇచ్చి తప్పదని అన్నారు. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లకు, గేటెడ్ కమ్యూనిటీలకు ధీటుగా ప్రభుత్వ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో కెసిఆర్ దేశానికే ఆదర్శంగా రోడ్లు, విద్యుత్, నీటి వసతి, ఏపుగా పెరిగిన చెట్ల వంటి అన్ని మౌళిక వసతులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేయించారన్నారు.రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాల్లో 18 వేల కోట్ల రూపాయలతో 2లక్షల 80 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారన్నారు. లాటరీల ద్వారా కొందరికి ఇండ్లు వచ్చాయని, మిగిలిన అర్హులకు కూడా సిఎం కెసిఆర్ ఇండ్లు అందించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. గతంలో ప్రభుత్వాలు పేదలకు ఉండేందుకు ఒక్క గది ఇంటి నిర్మాణం కోసం ముప్పుతిప్పలు పెట్టాయని అందువల్ల కొందరికి అనుమానాలు ఏర్పడుతుండవచ్చని అయితే కెసిఆర్ ప్రభుత్వం పేదప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకుంటుందన్నారు. అర్హులైనవారిని అధికారులు వెతుక్కుంటు వచ్చి ఇంటివద్దనే డబుల్‌బెడ్‌రూమ్ పట్టాకాగితాలు అందిస్తారన్నారు. ఎవరైనా ఇండ్లు ఇప్పిస్తామని 50వేలో, లక్షో అడిగితే ఇవ్వవద్దని వారి చెంపలు వాయించాలన్నారు.

అవినీతి రహిరంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా కేవలం అధికారులే అర్హులను గుర్తించి వారికి ఇండ్లు కేటాయించేలా తాము చర్యలు తీసుకున్నామన్నారు. పచ్చదనం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ 270కోట్ల మొక్కలు నాటించారన్నారు. సిఎం కెసిఆర్ మొండి, జిద్దు మనిషని ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టుపట్టి మరీ తెలంగాణ సాధించారని, అదే క్రమంలో పేదలైన వారందరికి డబుల్‌బెడ్‌రూమ్ ఇచ్చితీరుతామని మంత్రి కెటిఆర్ అన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల గృహప్రవేశాల సందర్భంగా కెసిఆర్ కాలనీని ప్రారంభించి లబ్దిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కెటిఆర్ సోమవారం గూడూరులో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కెసిఆర్ ప్రగతి భవన్‌ను ప్రారంభించారు.

గూడెం గ్రామంలో హెల్త్ సబ్‌సెంటర్‌ను, మోడల్ అంగన్‌వాడీ సెంటర్‌ను, పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. రామలక్ష్మణపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.సిరిసిల్లలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించి శ్రీరేణుకా ఎల్లమ్మ సిద్దోగం సందర్భంగా సిరిసిల్లలో శ్రీరేణుకా ఎల్లమ్మతల్లిని ఆలయంలో సందర్శించారు.ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని జగదాంబ తండాలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ వెంట టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఎంపిపి జనగామ శరత్‌రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా రైతుబంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్యతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News