Thursday, December 26, 2024

కాంగ్రెస్‌లో కెసిఆర్‌కు కోవర్టులుః బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కెసిఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో మానకొండురు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు బిజెపిలో చేరారు. వారికి కాషాయ కండు వా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపి బండి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌లో కెసిఆర్ కు కోవర్టులున్నారని, గత ఎ న్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజలు కెసిఆర్ ను మర్చిపోయారు అని అన్నా రు. బయటకు వస్తే పట్టించుకునేదెవరు? ఆయనలోపల ఉన్నా బయట ఉన్నా తేడా ఏముంది? బిఆర్‌ఎస్ జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? స్పష్టత లేదన్నారు.

జాతీయ పార్టీ అన్నోళ్లు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పాలి అన్నారు. తెలంగాణలోనే క్యాండిడేట్లకు దిక్కులేదు, ఇగ దేశంలో యాడ దొరుకుతరు?అని పేర్కొన్నారు. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కెటిఆర్ అంటున్నడు, పంచొద్దని ఎవరు వద్దన్నరు? ఎవరైనా పంచకుండా ఆయనను ఆపారా? అయినా బిఆర్‌ఎస్ నేతలు కూల్చేటోళ్లు, అధికారంలో ఉన్నన్నాళ్లు కూల్చినోళ్లే, కానీ మేం నిర్మించేటోళ్లం, భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలు కూడా తీసుకురానోడు, ఎములాడ రాజన్నకు, కొండగట్టుకు, ధర్మ పురి ఆలయా లకు డబ్బులు ఇస్తానని మోసం చేసింది నిజం కాదా అన్నారు.ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే గల్లీలో ఎవరైనా అధికారం లో ఉండనీయండి, ఢిల్లీలో ఉండాల్సింది మోదీనే ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి అప్పులు రావాలన్నా, అధి క నిధులు కావాలన్నా బిజెపితోనే సాధ్యం. బిజెపి ఎంపీలను గెలిపిస్తే మోదీగారి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తీ సుకొస్తాం. పొరపాటున కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలకు ఓట్లేస్తే అదనపు నిధుల సంగతి దేవుడెరుగు అన్నారు. కొత్త అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదనే విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి అన్నారు.

అభ్యర్థుల జాబితాను వెంటనే ప్రకటించే దమ్ముందా? ః
బిఆర్‌ఎస్ పార్టీ యాడుంది? ఆ పార్టీ గుర్తుపై ఎంపీలుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ పార్టీ నుండి పోటీ చేయ బోయే 17 మంది అభ్యర్థుల జాబితాను వెంటనే ప్రకటించే దమ్ముందా? ఎంపీ ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సన్నద్ధమైందని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కెసిఆర్ స్కెచ్ వేస్తున్నడు అని ఆరోపించారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు కెసిఆర్‌తో టచ్ లో ఉన్నారు.
కాంగ్రెస్‌లో కెసిఆర్‌కు కోవర్టులుః
కాంగ్రెస్‌లో కెసిఆర్‌కు కోవర్టులున్నారు. వాళ్లతో బేరసారాలు చేస్తున్నరని పేర్కొన్నా రు. గత ఎన్నికల్లో వాళ్లకు పెద్ద ఎత్తున పైసలిచ్చిండు.. మందికి పుట్టినోళ్లు కూడా తన పిల్లలే అనుకునే బాపతు. కెసిఆర్ కు ట్రలు, కుతంత్రాలవల్ల పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏదైనా జరగొచ్చు అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఆ బ దనాంను బిజెపిపైకి నెట్టివేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనన్నది కాంగ్రెస్ నేతలు దృష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుంది. వాళ్ల ప్రభుత్వాన్ని కూల్చేందుకు కెసిఆర్ కుట్రలు చేస్తుంటే గమనించడం లేదు, రాష్ట్ర ప్రజల బతుకులను సర్వ నాశనం చేసిన బిఆర్‌ఎస్ ను పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోం. ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహక రించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.

బిజెపి ఎంపీలు ఎక్కువగా గెలవాలిః
రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే,కేంద్రంలో బిజెపి ఎంపీలు ఎక్కువగా గెలవాలి అన్నారు.రాష్ట్రంలో అప్పు లెలా తీరుస్తారు? రైతు బంధు అందక 48 లక్షల మంది రైతులు అల్లాడుతున్నరు అని అవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సాయం లేకుం టే వాటినెలా తీరుస్తారు? రాష్ట్రానికి అప్పులు రావాలన్నా, అధిక నిధులు రావాలన్నా మోదీ ప్రభుత్వంతోనే సాధ్యం అన్నారు. రా హుల్ ప్రాపకం కోసమో, అధిష్టానం ఒత్తిడి తోనే బీజేపీపై విమర్శలు చేస్తే అది రాష్ట్రానికే నష్టమనే వాస్తవాన్ని గమనించాలి.రా ష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోదీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తారు.. ఎన్నికల తరువాత రాష్ట్రాల అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత నిస్తారు అని తెలిపారు.

రామ మందిరం రాజకీయాలకు అతీతంగాః
సాధు సంతువులు సూచించిన మంచి ముహూర్తం ప్రకారమే గృహ ప్రవేశం చేస్తారే తప్ప దీనిపై రాజకీయాలు చేయడం సరికా దని, అయోధ్య రామ మందిరం రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం అన్నారు. ఒకనాడు కాంగ్రెసోళ్లు అయోధ్యలోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని ఎద్దేవా చేశారు..వాళ్లను నేను అడిగేదొక్కటే.. మీరు మీ అమ్మ కడుపులోనే పుట్టరనడానికి ఆధారాలేమిటి?…అక్కడున్న డాక్టర్లు, నర్సులు చెబితేనే కదా మీకు తెలిసిందన్నారు.సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకుంటున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. కానీ దేశ ప్రజలు ప్రశాతంగా ఉంటూ కోర్టు తీర్పును స్వాగతించే సరికి జీర్ణించుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News